Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతనమవుతున్న బంగారం ధరలు...

Updated: మంగళవారం, 21 మే 2019 (18:30 IST)
ఈ ఏడాదిలో పసిడి ధర పతనం కొనసాగుతూనే ఉంది. అడపాదడపా పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ గత కొద్ది నెలలుగా బంగారం, వెండి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఇక మంగళవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గి, రూ.32,670కి పడిపోయింది. జ్యువెలర్లు, రిటైలర్ల నుండి బంగారానికి డిమాండ్ తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 
 
బంగారం ధర పడిపోతున్న తరుణంలో వెండి ధర మాత్రం ఇప్పటికి స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.37,350 వద్ద స్థిరంగానే ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 0.22 శాతం తగ్గి, 1,274.35 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్సుకు 0.36 శాతం తగ్గడంతో 14.39 డాలర్లకు దిగొచ్చింది.
 
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.50 తగ్గి, రూ.32,670కు, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గి, రూ.32,500కు దిగివచ్చింది. ఈ దోరణిని గమనిస్తే గత నాలుగు రోజుల్లో బంగారం ధర రూ.660 పడిపోయింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.31,710 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,200కి పెరిగింది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.32280 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,500గా కొనసాగింది.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments