ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (14:19 IST)

త్వరలో రూ.20 నాణెం.. రూ.10 కాయిన్ చెల్లుతుందా? లేదా?

దేశీయ కరెన్సీలోకి మరో కొత్త నాణంను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. త్వరలో రూ.20 నాణెం మన ముందుకు రాబోతోంది. కానీ ఈ నాణెం ఇప్పుడు ఉన్న నాణేలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుందని సమాచారం. సాధారణంగా 10 రూపాయల నాణెం 27 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో గుండ్రంగా ఉంటుంది. 
 
20 రూపాయల నాణేనికి మాత్రం 12 అంచులు ఉంటాయని వెల్లడించింది. 10 రూపాయల నాణేన్ని 2009 మార్చిలో చలామణిలోకి తెచ్చారు. ఈ నాణేనికి దశలవారీగా మార్పులు చేస్తూ మొత్తం 14 డిజైన్‌లలో విడుదల చేశారు. 
 
మరోవైపు, 10 రూపాయల నాణేలు చెల్లవని ఈ మధ్య ఉదంతులు వచ్చాయి. గతేడాది ఆర్బీఐ ఈ పుకార్లను కొట్టిపారేంసింది. ఇప్పటివరకు విడుదల చేసిన 14 డిజైన్‌ల నాణేలు చెల్లుతాయని చెప్పింది. రూ.20 నాణెం కొత్తగా ఉండబోతోంది. 10 రూపాయల నాణెం లాగా దీనికి కూడా రెండు రింగులు ఉంటాయి. 
 
వెలుపలి రింగ్‌ని 65శాతం రాగి, 15 శాతం జింక్‌, 20 శాతం నికెల్‌‌తో తయారు చేస్తుండగా, లోపలి రింగ్ 75 శాతం కాపర్‌, 20 శాతం జింక్‌, 5 శాతం నికెల్‌‌తో తయారు చేయనున్నారు. అయితే ఈ నాణేన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారో ఆర్థిక శాఖ స్పష్టం చేయలేదు.