పీవీ సింధు చేతులెత్తేసిందే..?

Last Updated: గురువారం, 7 మార్చి 2019 (11:39 IST)
భారత షట్లర్ పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో చేతులెత్తేసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే తన పోరాటాన్ని ముగించింది.


పోటీలకు తొలి రోజైన బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్ పోరులో ఐదో సీడ్ సింధు 16-21, 22-20, 18-21 తేడాతో సంగ్ జి హ్యున్(కొరియా) చేతిలో పోరాడి ఓడింది.
 
గత మూడు మ్యాచ్‌ల్లో సంగ్‌పై ఓడిపోవడం ఈ తెలుగు షట్లర్‌కు ఇది మూడోసారి కావడం విశేషం. 81 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో సింధు చాలాసార్లు అనవసర తప్పిదాలకు పాల్పడి ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. అయితే ఈ టోర్నీలో మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్, కిడంబి శ్రీకాంత్ తమ తమ ప్రత్యర్థులపై గెలుపును నమోదు చేసుకున్నారు. దీనిపై మరింత చదవండి :