శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (21:31 IST)

పంట రక్షణ కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రారంభించిన వ్యవసాయ సలహా హెల్ప్‌లైన్ హలో గోద్రెజ్

Hello Godrej
భారతదేశంలోని అతిపెద్ద, వైవిధ్యభరితమైన ఆహార, వ్యవసాయ-వ్యాపార సంస్థలలో ఒకటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్(జిఏవిఎల్), పంట రక్షణకు వాస్తవ సమయంలో ఫోన్ కాల్ ద్వారా నిపుణుల సలహాలను అందించడానికి బహుభాషా వ్యవసాయ సలహా హెల్ప్‌లైన్ 'హలో గోద్రెజ్'ను ఇటీవల ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతీయ భాషల్లో హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, బెంగాలీ, పంజాబీ, ఇంగ్లీషు భాషల్లో- రైతులకు అందుబాటులో ఉండేలా రూపొందించిన, ఈ కొత్త కార్యక్రమం, రైతులకు పూర్తి చేయూత అందించటం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచాలనే కంపెనీ ప్రయత్నాలకు అనుగుణంగా, రైతులకు అవసరమైనప్పుడల్లా ఒక్క కాల్ దూరంలో అందుబాటు ఉంటుంది.
 
ఈ కార్యక్రమం గురించి గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ, “గోద్రెజ్ ఆగ్రోవెట్‌ వద్ద మేము చేసే ప్రతి పనిలో రైతు కుటుంబాల అభ్యున్నతి ప్రధానమైనది. మంచి దిగుబడి కోసం సరైన సమయంలో సరైన పరిష్కారాల లభ్యత, వినియోగం తప్పనిసరి అయినందున, వాస్తవ -సమయంలో వ్యక్తిగతీకరించిన పరిష్కారాలను అందించడం ద్వారా రైతులు, వ్యవసాయ నిపుణుల మధ్య అంతరాన్ని తగ్గించడంలో "హలో గోద్రెజ్" మాకు సహాయం చేస్తుంది" అని అన్నారు. 
 
మారుతున్న వాతావరణ పరిస్థితులు, చీడపీడల బెడద రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటువంటి నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ పరిస్థితుల మధ్య, రైతులు తాజా పంట రక్షణ పరిష్కారాలను, వారు ఇష్టపడే భాషలో వ్యక్తిగతీకరించిన మార్గదర్శకాలను పొందేందుకు వీలు కల్పించడం ఇప్పుడు తక్షణ అవసరం. "హలో గోద్రెజ్" ద్వారా భారతదేశం అంతటా రైతులు ఇప్పుడు మా వ్యవసాయ నిపుణుల బృందం నుండి ప్రత్యక్ష సంభాషణ ద్వారా వాస్తవ సమయంలో సలహాలను పొందవచ్చు.
 
"పర్యావరణ అనుకూల, లాభదాయకమైన వ్యవసాయం వైపు వారి ప్రయాణంలో భారతీయ రైతులకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా ఉండాలనే కంపెనీ లక్ష్యంని "హలో గోద్రెజ్" ప్రతిబింబిస్తుంది. గోద్రెజ్ ఆగ్రోవెట్ యొక్క విస్తృతమైన అనుభవం, ఖ్యాతిపై ఆధారపడి, రైతులతో బలమైన, నమ్మకమైన సంబంధాలను ఏర్పరచుకోవడం, వ్యవసాయ రంగంలో దాని నాయకత్వాన్ని పటిష్టం చేయడం ద్వారా విశ్వసనీయ వ్యవసాయ సమాచారం కోసం గో-టు సోర్స్‌గా మార్చడం ఈ కార్యక్రమ లక్ష్యం,” అని  గోద్రెజ్ అగ్రోవెట్ లిమిటెడ్‌ వద్ద క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ రాజవేలు ఎన్ కె తెలిపారు. 
 
ఈ కార్యక్రమం ద్వారా, రైతు కుటుంబాలను ఉద్ధరించడానికి నాణ్యమైన, నమ్మదగిన ఉత్పత్తులను అందించాలనే గోద్రెజ్ ఆగ్రోవెట్ యొక్క దీర్ఘకాల నిబద్ధతతో, రైతుల  ప్రత్యేక అవసరాలు, సవాళ్లను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులను చేరుకోవాలని కంపెనీ భావిస్తోంది.