బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2017 (09:34 IST)

రైల్ రిజర్వేషన్ టిక్కెట్ మరింత సులభం...

భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

భారతీయ రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. రైల్ టిక్కెట్ రిజర్వేషన్‌‍ను మరింత సులభతరం చేసింది. ఇకపై భీమ్, యూపీఐ యాప్‌ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకొచ్చింది. డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది రైల్వే ప్రయాణికులకు ఊరట లభించనుంది. 
 
దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచి యూపీఐ చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది. దీంతో ఇకపై ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు. 
 
దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 7.5 లక్షల టికెట్లు బుక్ అవుతుండగా దాదాపు 97 శాతం బుకింగ్‌లు నగదు చెల్లింపుల ద్వారా జరుగుతుండగా మూడు శాతం మాత్రమే డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. దీంతో నగదు చెల్లింపులు తగ్గించి, డిజిటల్ లావాదేవీలను పెంచే చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది.