బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (13:33 IST)

ప్రత్యేక రైళ్లపై రైల్వే శాఖ కసరత్తు.. ఒక్కో రైలులో...

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రజా రవాణా బంద్ అయింది. రైల్వే శాఖ కూడా దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. అయితే, రెండో దశ లాక్‌డౌన్ మే 3వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తులు ప్రారంభించింది. 
 
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో రైల్వేశాఖ ఓ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేసింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ 400 ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తోంది. ఈ రైళ్లలో సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూనే, ప్రతి రైలులో కేవలం 1000 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది.