జియో న్యూ ఇయర్ ధమాకా.. రూ.2025తో కొత్త ప్లాన్.. వివరాలు ఏంటి?
దేశంలో అగ్రగామి ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో కొత్త సంవత్సరం 2025ను పురస్కరించుకుని సరికొత్త ప్లాన్‌ను తమ మొబైల్ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 2025 రూపాయలతో తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ 200 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో రోజుకు 2.5 జీబీ డేటాను వాడుకోవచ్చు. 'న్యూ ఇయర్ వెల్కమ్' ప్లాన్ పేరుతో జియో ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
రూ.2025తో రీఛార్జ్ చేసుకునే ఈ ప్లాన్‌లో 200 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు చేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ మొత్తం 500 జీబీ డేటా, అపరిమిత 5జీ డేటాను ఇస్తోంది. అంతేకాకుండా ఇది అజియో, స్విగ్గీ, ఈజ్ మై ట్రిప్ వంటి భాగస్వాములకు సంబంధించిన రూ.2150 విలువైన కూపన్లను కూడా జియో అందిస్తోంది.
ఇందులో రూ.500 అజియో, రూ.1500 ఈజ్ మై ట్రిప్, రూ.150 స్విగ్గీ కూపన్లు ఉన్నాయి. రూ.500 విలువైన అజియో కూపన్న రూ.2500, ఆపై కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చు. స్విగ్గీలో రూ.499 పైబడిన ఆర్డర్లపై రూ.150 డిస్కౌంట్ ఇస్తోంది. ఈజ్ మై ట్రిప్‌లో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు.
డిసెంబర్ 11 నుంచి 2025 జనవరి 11 వరకు ఈ ప్లాన్ అందుబాటులో ఉండనుంది. ఇవే ప్రయోజనాలతో వస్తున్న జియో ఇతర నెలవారీ ప్లాన్‌తో పోలిస్తే ఈ ప్లాన్ ద్వారా రూ.450 వరకు ఆదా చేసుకోవచ్చని జియో పేర్కొంది.