బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ అదుర్స్- రూ.1,999 రీచార్జ్‌పై రూ.100 తగ్గింపు
ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దీపావళి సందర్భంగా యూజర్లకు సరికొత్త ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ పండుగ తర్వాత కూడా చెల్లుబాటు కానుంది. బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి ఆఫర్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు చెల్లుబాటు అవుతుంది.
ఈ సమయంలో వినియోగదారులు రూ.1,999 రీచార్జ్ ప్లాన్‌పై రూ.100 డిస్కౌంట్ కూడా పొందవచ్చు. అంటే ఈ ప్లాన్‌కు రూ.1,899 చెల్లిస్తే సరిపోతుంది. ఇక ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు 600 జీబీ డేటాను పొందుతారు. దీపావళి స్పెషల్ ఆఫర్‌లో రూ.1,999 రీచార్జ్ వోచర్‌పై రూ.100 తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొంది.
పోస్ట్ దీపావళి స్పెషల్ ఆఫర్
మా రూ.1999 రీఛార్జ్ వోచర్‌లో రూ.100 తగ్గింపు పొందవచ్చు.
ప్రస్తుతం రూ.1899లతో ఒక సంవత్సరం పాటు 600GB డేటా, అపరిమిత కాల్‌లు, గేమ్, మ్యూజిక్‌లను ఆస్వాదించవచ్చు. ఈ పండుగ ఆఫర్ నవంబర్ 7, 2024 వరకు చెల్లుతుంది.