మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 17 డిశెంబరు 2022 (17:10 IST)

మెట్రో వినియోగదారుల కోసం క్రెడిట్ కార్డ్‌‌ను ప్రారంభించిన కోటక్, మెట్రో క్యాష్, క్యారీఇండియా

Cash
భారతదేశంలోని ప్రముఖ ఆర్గనైజ్డ్ హోల్‌సేలర్, ఫుడ్ స్పెషలిస్ట్ అయిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాతో కలిసి కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ నేడిక్కడ కొత్త కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్- ‘మెట్రో కోటక్ క్రెడిట్ కార్డ్‌’ ను ఆవిష్కరించింది. ఈ కార్డ్ 3 మిలియన్లకు పైగా నమోదిత మెట్రో ఇండియా కస్టమర్లకు 48 రోజుల వరకు సులభమైన, వడ్డీ రహిత క్రెడిట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ కార్డ్ రూపే నెట్‌వర్క్‌ లో ప్రారంభించబడింది. మెట్రో కస్టమర్ బేస్‌లో చిన్న వ్యాపారులు, కిరాణా యజమానులు, ఎంఎస్ఎంఈలు, చిన్న రెస్టారెంట్లు, HoRe Ca (హోటల్‌లు, రెస్టారెంట్లు మరియు క్యాటరర్స్), కార్యాలయాలు, కంపెనీలు, సంస్థలు, అలాగే స్వయం ఉపాధి నిపుణులు ఉన్నారు. కొత్త మెట్రో కోటక్ క్రెడిట్ కార్డ్‌ ను భారతదేశంలోని 21 నగరాల్లో ఉన్న 31 హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ల (స్టోర్‌లు) మెట్రో నెట్‌వర్క్‌‌లో, అలాగే మెట్రో హోల్‌సేల్ యాప్-ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఉపయోగించవచ్చు.
 
విశిష్టతలు మరియు ప్రయోజనాలు:
మెట్రో నుండి తమ రిటైల్ దుకాణాలలో నిల్వ చేయడానికి పెద్దమొత్తంలో కొనుగోలు చేసే రిటైలర్ల క్రెడిట్ అవసరాలను తీర్చడానికి మెట్రో కోటక్ క్రెడిట్ కార్డ్ రూపొందించబడింది.   
 
బి2బి విభాగంలో ఆకర్షణీయమైన క్రెడిట్ సదుపాయం - మెట్రో వ్యాపార కస్టమర్లకు 48 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్
 
క్రెడిట్ పరిమితి పరిధి- రూ. 25,000 నుండి మెట్రోతో కస్టమర్ కొనుగోలు నమూనా ఆధారంగా గరిష్ట క్రెడిట్ వరకు
 
నగదు లేదా ఆన్‌లైన్ బదిలీ ద్వారా సౌకర్యవంతమైన రీపేమెంట్ ఎంపికలు
 
కార్డ్ వినియోగదారులు మెట్రోలో వారి నెలవారీ ఖర్చులకు లోబడి, నెలకు రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
 
బ్యాంకు ఖాతా లేని మెట్రో వ్యాపార కస్టమర్లు కూడా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
 
కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన ప్రక్రియ
 
'జాయినింగ్' లేదా 'వార్షిక' రుసుములు లేవు
 
ఈ సందర్భంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ హెడ్ మిస్టర్ ఫ్రెడరిక్ డిసౌజా మాట్లాడుతూ, ‘‘దేశంలోని రిటైల్ పరిశ్రమకు వెన్నెముకగా ఉన్న లక్షలాది మంది చిన్న వ్యాపారులు, కిరాణా స్టోర్ యజమానులు, ఎంఎస్ఎంఈల కోసం రూపొందించిన క్రెడిట్ కార్డ్‌‌ను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్‌లో 80% అసంఘటిత వ్యాపారులు ఉన్నారు. ఈ ప్రత్యేకమైన ఆఫర్ ద్వారా, మేం ఈ విభాగం క్రెడిట్, ఫైనాన్స్ అవసరాలను తీరుస్తున్నాం. ఇది గణనీయ మైన మార్కెట్ అవకాశం’’ అని అన్నారు.
 
ఈ సందర్భంగా కిరాణాలు, ఎంఎస్ఎంఈ లకు వాయిస్‌గా ఉండటానికి మెట్రో నిబద్ధత గురించి మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ఎండీ, సీఈఓ శ్రీ అరవింద్ మెదిరట్ట మాట్లాడుతూ, "స్వతంత్ర వ్యాపారానికి అండగా నిలిచే సం స్థగా మేం ఎల్లప్పుడూ స్థానిక వ్యాపారాలు, ఎంఎస్ఎంఈ ఆవరణానికి మద్దతు ఇవ్వడానికి, వారి వ్యాపారాన్ని మరింత లాభదాయకం, విజయవంతంగా చేయడానికి వారికి సాధికారికత కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. భారతీయ రిటైల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చిన్న రిటైలర్లు, కిరాణాలు, ఎంఎస్ఎంఈలకు మరింత లిక్విడిటీ లైన్ అందించడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో చేతులు కలపడం పట్ల మేం సంతోషిస్తున్నాం. వారి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పరిష్కరించడానికి అనుకూలీకరించిన, అవాంతరాలు లేని ఆర్థిక పరిష్కారా న్ని అందించడానికి మా నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు.
 
‘‘కిరాణాల కోసం మా డిజిటల్ ఇంటర్వెన్షన్ అనేది డిమాండ్ మరియు సరఫరా రెండింటిలోనూ విలువను జోడించేందుకు తోడ్పడుతుంది. సరఫరా విషయానికి వస్తే, మేం స్టోర్‌లో లేదా మా ఇకామర్స్ ఆఫర్‌ల ద్వారా అన్నింటిని ఒకే చోట, పోటీ ధరతో విస్తృత శ్రేణి వస్తువులను కొనుగోలు చేసే సౌలభ్యాన్ని అందిస్తున్నాం. దీని వలన వారికి ఎంతో సమయం, ఖర్చు ఆదా చేయడంతోపాటు వేగంగా పూర్తి చేయడం, 24 గంటల్లో డోర్‌స్టెప్ డెలివరీ సేవ లభిస్తాయి. అదనంగా, మేం కిరాణా వారికి డిమాండ్‌ను పెంచడానికి ఉత్ప్రేరకం వలె వ్యవహరిస్తాం; మా స్మార్ట్ కిరాణా ప్రోగ్రామ్ ద్వారా డిజిటలైజేషన్, ఆధునీకరణ ద్వారా తమ ఆదాయాలు, బాటమ్ లైన్‌ను పెంచుకోవడంలో మేం వారికి సహాయం చేస్తాం. అలాగే వారి వర్కింగ్ క్యాపిటల్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి క్రెడిట్ లభ్యతను సులభతరం చేస్తాం. ఇలాంటి లిక్విడిటీ జోక్యాలు వారి టాప్‌లైన్, బాటమ్ లైన్, నగదు ప్రవాహాలను మెరుగు పరిచేందుకు, వారి వ్యాపారాన్ని మరింత సుస్థిరంగా పెంపొందించడంలో సహాయపడతాయి’’ అని అన్నారు.
 
ఈ ఆవిష్కరణపై ఎన్పీసీఐ, రూపే హెడ్ డెన్నీ వి థామస్ మాట్లాడుతూ, ‘‘మెట్రో కోటక్ క్రెడిట్ కార్డును రూపే నెట్‌వర్క్‌‌లో ప్రారంభించడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్, మెట్రో క్యాష్ అండ్ క్యారీతో సహకరించడం మాకు ఆనందంగా ఉంది. ఈ కార్డ్ రిటైల్ స్టోర్ ఆపరేటర్ల అవసరాలను తీర్చడానికి, లాభదాయకతలో, రోజువారీ కార్యకలాపాలలో వారికి సహాయపడటానికి శ్రద్ధగా రూపొందించబడిందని మేం విశ్వసిస్తున్నాం. దీని ప్రకారం, రిటైల్ స్టోర్ ఆపరేటర్‌లకు చెల్లింపు కోసం 48 రోజుల వరకు క్రెడిట్ లైన్ అందించడానికి కార్డ్ ప్రారంభించబడింది. అన్ని కస్టమర్ విభాగాలకు సంబంధించిన, ఉపయోగకరమైన వినూత్న చెల్లింపు పరిష్కారాలను ఆవిష్కరించడానికి, అందించడానికి ఈ వ్యవస్థతో కలిసి పని చేయడం మాకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు.