గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:10 IST)

గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.800 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.. తెలుసా? ఎలాగంటే?

మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ అయిపోయిందా? అయితే మీకు ఓ శుభవార్త. ప్రస్తుతం గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే అతి తక్కువ ధరలోనే గ్యాస్‌ సిలిండర్‌ను పొందవచ్చు. ఈ అదిరిపోయే ఆఫర్‌లో కేవలం రూ.9కే గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం లభించనుంది. గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.800 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. 
 
అయితే ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ రూ.10 నుంచే వస్తుంది. ఆఫర్‌ కొన్ని రోజులు మాత్రమే వస్తుంది. అంటే ప్రస్తుతం గ్యాస్‌ బుక్‌ చేసుకునే వారి పంట పండినట్లే. ఈ అద్భుతమైన ఆఫర్‌ ద్వారా భారీ తగ్గింపు మీ సొంతం చేసుకోవచ్చు. 
 
దీనికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు, ఈ ఆఫర్‌ను మీరు ఇంట్లో నుంచే పొందవచ్చు. ఈ-వాలెట్‌ సంస్థ పేటీఎం వినియోగదారులకు ఈ అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తన ప్లాట్‌ఫాం ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకుంటే ఈ క్యాష్‌బ్యాక్‌ అవకాశం లభిస్తుంది.
 
పేటీఎం ద్వారా ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకుని రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఒకవేళా గ్యాస్‌ సిలిండర్‌ రూ.800 ఉంటే, మీరు గ్యాస్‌ బుక్‌ చేసుకున్నప్పుడు రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. కానీ, ఈ ఆఫర్‌ కేవలం ఈ నెల వరకే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ కేవలం పేటీఎం ద్వారా గ్యాస్‌ చేసుకుంటేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.
 
అయితే, ఈ ఆఫర్‌లో మీరు రూ.10 నుంచి రూ.800 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. అంటే రూ.800 లోపు ఎంతైనా క్యాష్‌బ్యాక్‌ రావచ్చు. తక్కువలో తక్కువ రూ.10 నుంచి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ డబ్బులు కేవలం 24 గంటల్లోనే క్యాష్‌బ్యాక్‌ మీ ఖాతాలో వచ్చి చేరుతుంది.