శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (19:34 IST)

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి పోకో ఎక్స్3 ప్రో.. ఫీచర్స్ ఏంటో తెలుసా?

Poco X3 Pro
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62, రియల్ మీ ఎక్స్7, వివో వీ20 2021 స్మార్ట్ ఫోన్లకు  పోటీ ఇవ్వనుంది. అలాగే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీంతోపాటు ఇందులో 120 హెర్ట్జ్ డిస్ ప్లే కూడా ఉండనుంది. 
 
పోకో ఎక్స్3 ప్రో ధర రూ.18,999 నుంచి ప్రారంభం కానుంది. గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఏప్రిల్ 6వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. 
 
ఫీచర్లు ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లలో లభించనుంది. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
 
గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు.
 
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్582 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.