Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగివచ్చిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు

Written By సెల్వి
Updated: గురువారం, 6 మే 2021 (16:11 IST)
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు దిగివచ్చాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట కలిగించింది. అయితే ఈసారి ప్రభుత్వం సాధారణ ప్రజలకు ఈ బెనిఫిట్ అందించలేదు. వంట గ్యాస్ సిలిండర్ ధర ఈ నెలలో స్థిరంగానే ఉంది. అయితే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. 
 
ఈ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.46 మేర దిగివచ్చింది. దీంతో ఇప్పుడు ఈ సిలిండర్ రూ.1610కు లభిస్తోంది. 19 కేజీల సిలిండర్లను కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌గా పేర్కొంటాం. మే 1 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ఇకపోతే 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఈ నెల ఎలాంటి మార్పు లేదు. 
 
దేశ రాజధాని న్యూఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.809గా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..
హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 861 వద్ద కొనసాగుతోంది. సిలిండర్ ధరకు మరో రూ.20 లేదా రూ.30 చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డెలివరీ బాయ్స్‌ రూ.20- రూ.30 తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments