బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (11:51 IST)

వంట గ్యాస్ ధర బాదుడు... సబ్సిడీయేతర గ్యాస్ ధర పెంపు

దేశంలో ఒకవైపు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధ‌ర పెరుగుద‌ల‌తో ఇప్ప‌టికే ఇబ్బందులు ప‌డుతోన్న సామాన్యుడి నెత్తిన గ్యాస్ ధ‌ర‌ల రూపంలో మరో పిడుగు పడుతోంది.
 
తాజాగా సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరను చమురు కంపెనీలు పెంచేశాయి. కొత్తగా పెంచిన ధరల మేరకు... 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్‌పై రూ.25.50 పెంచుతున్న‌ట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ తెలిపింది. 
 
ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆరు నెల‌ల్లో 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్ ధర రూ.140 పెరిగింది. దీంతో ఢిల్లీ, ముంబైలో మే 1 నుంచి 809 రూపాయ‌లుగా ఉన్న 14.2 కిలోల సిలిండర్ ధర రూ.834.50కి చేరింది.
 
చెన్నైలో అత్య‌ధికంగా రూ.850.50గా 14.2 కిలోగ్రాముల‌ సిలిండర్ ధ‌ర ఉంది. మే 1 నుంచి నిన్న‌టివ‌ర‌కు అక్క‌డ సిలిండర్ ధ‌ర 825 రూపాయ‌లుగా ఉంది. కాగా, 19 కిలోల‌ వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర రూ.76 పెరిగింది.