మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (12:08 IST)

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. రోగులందరూ సురక్షితం

ఢిల్లీ ఎయిమ్స్‌లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ఆల్‌ ఇండియా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ప్రధాన అత్యవసర వార్డులో (ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో) ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు మంటలు, పొగ కనిపించాయి. వెంటనే అప్రమత్తమయిన వైద్య సిబ్బంది రోగులందరినీ బాధిత ప్రాంతం నుంచి సురక్షితంగా తరలించారు. 
 
విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఏడు ఫైర్‌ ఇంజన్‌లు సంఘటన స్థలానికి చేరుకుని గంట వ్యవధిలో మంటలను ఆర్పివేశాయి. అధికారులు మాట్లాడుతూ... ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని. ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.