బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 ఆగస్టు 2020 (18:06 IST)

దక్షిణాది భాషలతో పాటు మరాఠీ, బంగ్లాకి విస్తరించిన మైండ్ వార్స్

స్కూలుకు వెళ్లే వయసు గ్రూపులో వున్న పిల్లల కోసం భారతదేశంలో అతిపెద్ద నాలెడ్జ్ డేటాబేస్‌ని సృష్టించేందుకు ఏప్రిల్ 2019లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా జి5 ఫ్లాట్‌ఫారంపై మైండ్ వార్స్ అనే ఇంటిగ్రేటెడ్ యాప్ లాంఛ్ చేయబడింది. ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన, పంచుకునేలా మరియు గేమిఫైబుల్ అనుభూతి ద్వారా నాలెడ్జ్ పొందడం మందకొడిగా, విసుగుగా వుంటుందనే భావనకు చెల్లుచీటి చెప్పాలనే లక్ష్యాన్ని మైండ్ వార్స్ కలిగి వుంది.
 
ఇండియాని స్మార్టర్‌గా మార్చేందుకు అవసరమయ్యే నాలెడ్జిని మెరుగుపరిచే మార్గాలను పునః నిర్మించడాన్ని బలోపేతం చేయడానికి మైండ్ వార్స్ తన భాషా పోర్టుఫోలియోని హిందీ మరియు ఇంగ్లీషుతో పాటుగా 6 ప్రాంతీయ భాషలు, తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ, బంగ్లా మరియు కన్నడంకి విస్తరించింది.
 
మైండ్ వార్స్ యాప్‌పై మాతృభాషలో లభించే కంటెంట్ అనేక అంశాల్లో విద్యార్థుల నాలెడ్జిని బలోపేతం చేస్తుంది. దీని ఫలితంగా ఇది వారి స్కూలు లేదా భాషతో సంబంధం లేకుండా జాతీయ ఫాట్‌ఫారంపై తన తోటివారితో పోటీపడేందుకు మరియు చిట్టచివరికి టివి క్విజ్ షోలో భాగమయ్యే అవకాశాన్ని ప్రతి విద్యార్థి దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
 
మైండ్ వార్ విజయం సాధించడంపై జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉమేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ... మైండ్ వార్ ఫ్లాట్‌ఫారంపై విద్యార్థుల కొరకు కొత్త సవాళ్లు, డెవలెప్మెంట్లు మరియు ప్రోత్సాహాలతో 2020 అద్భుతమైన సంవత్సరంగా నిలుస్తుంది. ఇంగ్లీషు మరియు హిందీకి అదనంగా మరో 6 భాషల్లో కంటెంట్ అనువదించడంతో, మన దేశ వ్యాప్తంగా వుండే విద్యార్థులతో గరిష్టంగా అనుసంధానం కావడానికి మరియు భాష అంతరాలు లేకుండా అనుసంధానం అయ్యేలా చేయడానికి దోహదపడుతుంది.