మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (16:11 IST)

యూనియన్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నుంచి యూనియన్‌ మీడియం డ్యూరేషన్‌ ఫండ్‌ ఆవిష్కరణ

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు అనుబంధ సంస్థ యూనియన్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ మరియు దాయ్-ఇచి లైఫ్‌ హోల్డింగ్స్‌, ఇంక్‌లు యూనిమన్‌ మీడియం డ్యూరేషన్‌ ఫండ్‌ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించాయి.
 
ఇది ఓపెన్‌ ఎండెడ్‌ మీడియం టర్మ్‌ డెబ్ట్‌ పథకం. మెకాలే కాలవ్యవధి మూడు నుంచి నాలుగేళ్ల కలిగి ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇది పెట్టుబడి పెడుతుంది. యూనియన్‌ మీడియం డ్యూరేషన్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ఆగస్టు 24వ తేదీ తెరువబడుతుంది మరియు సెప్టెంబర్‌ 7వ తేదీన ముగుస్తుంది.
 
సెప్టెంబర్‌ 14వ తేదీన కేటాయింపులు జరుపుతారు మరియు సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి నిరంతర అమ్మకాలు మరియు కొనుగోలు కోసం తిరిగి తెరుస్తారు. క్రిసిల్‌ మీడియం టర్మ్‌ డెబ్ట్‌ ఇండెక్స్‌కు ఈ స్కీమ్‌ బెంచ్‌మార్క్‌ చేయబడింది మరియు దీనిని శ్రీ పరిజిత్‌ అగర్వాల్‌, శ్రీ అనిన్ద్య సర్కార్‌ నిర్వహిస్తున్నారు. ఈ పథకంలో కనీసం 5వేల రూపాయలు మరియు ఆపైన 1 రూపాయి గుణిజాలలో ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు.
 
శ్రీ జీ.ప్రదీప్‌కుమార్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో), యూనియన్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ మాట్లాడుతూ ‘‘మా కంపెనీ నుంచి ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ డెబ్ట్‌ పథకంలో ఖాళీలను పూరించే దిశగా వేసిన ముందడుగు యూనియన్‌ మీడియం డ్యూరేషన్‌ ఫండ్‌. ఈ పోర్ట్‌ఫోలియో నిర్మాణాన్ని సంపూర్ణం చేసేందుకు అత్యున్నత క్రెడిట్‌ నాణ్యత కలిగిన  పీఎస్‌యు/కార్పోరేట్‌ బాండ్లులో వ్యూహాత్మకంగా కేటాయింపులు మరియు భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో వ్యూహాత్మక కేటాయింపుల యొక్క సమ్మేళనంగా చేశాం.
 
ఈ స్కీమ్‌ యొక్క పోర్ట్‌ఫోలియో నిర్మాణం మా బలమైన స్థిర ఆదాయ పెట్టుబడి ప్రక్రియ ద్వారా మార్గనిర్ధేశనం చేయబడుతుంది’’ అని అన్నారు. యూనియన్‌ ఏఎంసీని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరియు దాయ్‌–ఇచి లైఫ్‌, జపాన్‌ కో–స్పాన్సర్‌ చేస్తున్నాయి. జూలై 2002 నాటికి తమ నిర్వహణలో 4వేల కోట్ల ఆస్తులను  నిర్వహిస్తుంది.
 
భారతదేశంలోని చిన్న పట్టణాలు, నగరాలలోని పెట్టుబడిదారులను ఆకర్షించడంలో యూనియన్‌ ఏఎంసీ విజయవంతం అయింది. ఈ కంపెనీ 2లక్షలకు పైగా ఫోలియోలను జోడించింది. వీటిలో 75వేల ఫోలియోలు మొట్టమొదటిసారిగా పెట్టుబడులు పెట్టిన వారు. దాదాపు 70% యూనియన్‌ ఏఎంసీ ఇన్వెస్టర్లు మొదటిసారి పెట్టుబడిదారులు మరియు దాదాపు 44% ఫోలియోలు బీ-30 నగరాల నుంచి ప్రస్తుతానికి ఉన్నాయి.