శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:38 IST)

మొట్టమొదటిసారిగా లైవ్‌ ఆన్‌లైన్‌ ప్రోపర్టీ ఎక్స్‌పో ‘రైట్‌ టు హోమ్‌’ను నిర్వహిస్తున్న ప్రాప్‌టైగర్‌

ఇలారా టెక్నాలజీస్‌ సొంతమైన ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద లైవ్‌ ఆన్‌లైన్‌ ప్రోపర్టీ ఎక్స్‌పో ‘రైట్‌ టు హోమ్‌’ను నిర్వహిస్తుంది. ఈ ఎక్స్‌పో వినూత్నమైనది. దీనిలో కొనుగోలుదారులు సుప్రసిద్ధ ప్రోపర్టీ నిపుణులు సమర్పిస్తున్న ఆన్‌లైన్‌ ప్రెజెంటేషన్స్‌లో నేరుగా పాల్గొనడంతో పాటుగా ముఖాముఖి డిజిటల్‌ చర్చలను సైతం ప్రోపర్టీ డెవలపర్లకు చెందిన సలహాదారులతో పాటుగా ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ ప్రతినిధులతో చేయవచ్చు. సంభావ్య గృహ కొనుగోలుదారులు ఉత్సాహపూరితమైన స్పాట్‌ ఆఫర్లను సైతం ఈ కార్యక్రమంలో భాగంగా పొందవచ్చు మరియు డిజిటల్‌గా తమ కలల ఇంటినీ కొనుగోలు చేయవచ్చు.
 
రెండు రోజుల పాటు జరిగే ఈ వర్చువల్‌ కార్యక్రమాన్ని ఆగస్టు 21, 22, తేదీలలో నిర్వహించనున్నారు. దాదాపు 30 మందికి పైగా డెవలపర్లు ఈ ఎక్స్‌పోలో పాలుపంచుకోవడంతో పాటుగా అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, ఎంఎంఆర్‌, నోయిడా, పూనె లాంటి తొమ్మిది నగరాల్లోని 80కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు.
 
ఈ ఎక్స్‌పోలో పలు విభాగాలైనటువంటి అందుబాటు ధరలలోని గృహ కొనుగోలు నుంచి మధ్య తరహా ధరలు మరియు విలాసవంతమైన గృహ కొనుగోలుదారుల అవసరాలను తీర్చే రీతిలో ప్రోపర్టీలను ప్రదర్శించనున్నారు. ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పోలో పాల్గొనబోతున్న సుప్రసిద్ధ డెవలపర్లలో గోద్రేజ్‌, బ్రిగేడ్‌, లోధ, మహీంద్రా లైఫ్‌ స్పేసెస్‌, ఎమ్మార్‌, షాపూర్జీ పల్లోంజీ, పీఎస్‌ గ్రూప్‌ మరియు మెర్లీన్‌ వంటివి ఉన్నాయి.
 
ప్రస్తుతం గృహ ఋణ వడ్డీ రేట్లు దాదాపు 7%గా ఉన్నాయి మరియు ఇది దాదాపు 15 సంవత్సరాల కాలంలో కనిష్టంగా ఉంది. ఇల్లు కొనుగోలు చేయడానికి ఇది అత్యుత్తమ సమయం. మా ‘రైట్‌ టు హోమ్‌’ ఎక్స్‌పో వినియోగదారులకు నమ్మకమైన వేదికను అందించడంతో పాటుగా ప్రోపర్టీ నిపుణుల నుంచి లోతైన అంతర్దృష్టులను సైతం అందించనుంది. అదే సమయంలో ఆకర్షణీయమైన రేట్లలో వర్ట్యువల్‌గా గృహాలను ప్రత్యేకమైన స్పాట్‌ ఆఫర్లతో కూడా పొందవచ్చు.
 
ఈ కార్యక్రమ నిర్వహణ తీరు విభిన్నంగా ఉంటుంది. దీనిలో గృహ కొనుగోలుదారులకు ప్రోపర్టీ నిపుణులతో ముఖాముఖి చర్చించే అవకాశం లభిస్తుంది. అందువల్ల వారు తమ కొనుగోలునిర్ణయాలను తక్షణమే తీసుకునే అవకాశమూ కలుగుతుంది. మేము పలువురు సుప్రసిద్ధ డెవలపర్లతో భాగస్వామ్యం చేసుకుని పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు బహుళ ప్రాంతాలలో, విభిన్నమైన ధరల వద్ద ప్రతి గృహ కొనుగోలుదారుని అవసరాలనూ తీర్చేలా ఏర్పాట్లు చేశాము.
 
వెబ్‌సైట్‌ సందర్శకుల నుంచి ఈ కార్యక్రమానికి అపూర్వమైన స్పందనను మేము చూస్తున్నాం. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భారీ సంఖ్యలో గృహ కొనుగోలుదారులు పాల్గొంటారని ఆశిస్తున్నాము. మా కార్యక్రమం పూర్తి వర్ట్యువల్‌గా ఉంటుంది. తద్వారా మరోమారు రియల్‌ ఎస్టేట్‌ రంగం డిజిటలైజేషన్‌లో మా నాయకత్వ సామర్ధ్యం ప్రదర్శిస్తున్నాము. కోవిడ్‌ 19 సంక్షోభం ఆరంభం అయిన నాటి నుంచి అత్యంత వేగంగా ఈ రంగం డిజిటల్‌గా మారుతుంది’’ అని శ్రీ మణి రంగరాజన్‌, గ్రూప్‌ సీఓఓ, హౌసింగ్‌ డాట్‌ కామ్‌, మకాన్‌ డాట్‌ కామ్‌ మరియు ప్రాప్‌టైగర్‌ డాట్‌ కామ్‌ అన్నారు.