శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (17:01 IST)

తెలంగాణ సచివాలయానికి పెయింట్ భాగస్వామిగా ఎంపికైన నిప్పన్ పెయింట్

telangana secretariat
ఆసియా అగ్రగామి పెయింట్ తయారీ సంస్థ అయిన నిప్పన్ పెయింట్ (ఇండియా), హైదరాబాద్‌లో ప్రస్తుతం నిర్మితమవుతున్న తెలంగాణ సచివాలయ ప్రాజెక్ట్‌కు పెయింట్ భాగస్వామిగా ఎంపికైంది. తెలంగాణ నూతన సచివాలయ ప్రాజెక్ట్ లోపలి, బయటి గోడలకు నిప్పన్ పెయింట్ హైటెక్, పర్యావరణ స్నేహపూర్వక పెయింట్స్‌ను వినియోగించనున్నారు. లీడ్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్స్ ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్ట్స్.

 
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు ఇటీవల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ఆర్కిటెక్ట్ పొన్ని కాన్సెసావొ, ఆర్కిటెక్ట్ ఆస్కార్ కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ప్రాజెక్ట్ పురోగతి గురించి వారు ఆయనకు వివరించారు.

 
పెయింటింగ్ చేయడం ద్వారా పబ్లిక్ స్పేస్‌లను అందంగా తీర్చిదిద్దాలన్న నిప్పన్ పెయింట్ ప్రయత్నాలకు అనుగుణంగానే ఈ భాగస్వామ్యం ఉంది. అంతేగాకుండా నూతన సచివాలయ భవనం డిజైన్ పరంగా గ్రీన్ బిల్డింగ్. పర్యావరణ స్నేహపూర్వక భవితను నిర్మించాలన్న నిప్పన్ పెయింట్ ఇండియా యొక్క అంకిత భావానికి అనుగుణంగా అది ఉంది. పెయింటింగ్ పనులు రాబోయే రెండు వారాల్లో ప్రారంభమవుతాయి.

 
ఈ భాగస్వామ్యం గురించి నిప్పన్ పెయింట్ ఇండియా డెకొరేటివ్ పెయింట్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ మహేశ్ ఆనంద్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో గ్రీన్ కో- గ్రీన్ ప్రొ రెండు ధ్రువీకరణలు పొందిన మొదటి సంస్థగా ఈ ల్యాండ్ మార్క్ భవనాన్ని అందంగా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలపడం మాకెంతో ఆనందదాయకం. నగర సుందరీకరణలు నిప్పన్ ఇన్షియేటివ్స్‌లో అతి ముఖ్యభాగం ఎందుకంటే అవి పరిశుభ్ర, హరిత నగరాల సాధనకు తోడ్పడుతాయి.

 
నిప్పన్ పెయింట్ హైటెక్, పర్యావరణ స్నేహపూర్వక పెయింట్స్ తెలంగాణ నూతన సచివాలయం వంటి ల్యాండ్ మార్క్ భవనాలకు కచ్చితంగా సరిపోయే పెయింట్ ను అందిస్తాయి. మరెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పొందాలని మేం ఆశిస్తున్నాం. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను పొందిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్ట్ లతో కలసి పని చేయడం మాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.