ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (12:33 IST)

ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు.. 3,614 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

Jobs
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) దేశవ్యాప్తంగా వివిధ భాగాల్లో మొత్తం 3,614 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
 
అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిసెంట్లు, ఎలక్ట్రీషియన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఫిట్టర్ తదిత విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత పరీక్షలో మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
అర్హత:
సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్, డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
 
వయసు:
15.05.2022నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వరకు వయసు సడలింపు ఉంటుంది.
 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
 
చివరి తేదీ: 2022 మే 15 సాయంత్రం 6 గం. వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.
 
వెబ్‌సైట్:  https://ongcindia.com/