బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (15:33 IST)

భారత్‌లో మొత్తం టోల్ ఫ్లాజాలు ఎత్తేస్తాం.. నితిన్ గడ్కరీ

భారత్‌లో మొత్తం టోల్ ఫ్లాజాలు ఎత్తేస్తామని.. జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణ చేపడతామని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏడాదిలో టోల్ ప్లాజాలను మొత్తం తొలగిస్తామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ వాడుతున్నాయని, మిగిలిన 7 శాతం వాహనాలకు రెట్టింపు టోల్ వేసినా ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేదని ఆయన తెలిపారు. 
 
గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గడ్కరీ ఈ విషయాన్ని చెప్పారు. దేశంలో ఏడాదిలోపే భౌతిక టోల్ ప్లాజాలను మొత్తం ఎత్తేస్తామని సభకు హామీ ఇస్తున్నాము. అంటే టోల్ సేకరణ అనేది జీపీఎస్ ద్వారానే నడుస్తుంది. వాహనాలపై ఉండే జీఎపీఎల్ ఇమేజింగ్ ద్వారా టోల్ సేకరిస్తారు అని గడర్కీ వెల్లడించారు.
 
ఇక ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ చెల్లించని వాహనాలపై తాము పోలీసు విచారణకు ఆదేశించినట్లు కూడా ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ చెప్పారు. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోవడం వల్ల టోల్ చోరీ, జీఎస్టీ ఎగవేయడంలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 2016లో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ ఫాస్టాగ్‌లను గత నెల 16 నుంచి తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.