శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 4 మార్చి 2021 (17:23 IST)

హిందూపురంలో బాలయ్య రోడ్ షో: వాహనం తప్ప జనం లేరు

యువరత్న బాలకృష్ణ వస్తున్నాడంటే మూలనున్న ముసలమ్మ కూడా రోడ్డెక్కి చూసే రోజులు ఒకప్పుడు. ఇపుడంతా కథ అడ్డంగా తిరిగిపోయినట్లుంది. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో తెదేపా ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ హిందూపురంలో పర్యటించేందుకు వెళ్లారు.
 
రోడ్ షోకి బయలుదేరిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. రోడ్ షోలో పట్టుమని 100 మంది జనం కూడా కనిపించలేదు. దీనితో బాలయ్య తీవ్ర అసహనానికి గురైనట్లు సమాచారం.
 
మరోవైపు గత పంచాయతీ ఎన్నికల్లో బాలయ్యకు హిందూపురం నియోజకవర్ పంచాయతీ ప్రజలు షాకిచ్చారు. నియోజకవర్గ పరిధిలో వున్న 38 పంచాయతీ స్థానాలకు గాను 30 స్థానాలు వైసిపికి కట్టబెట్టారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఎలా వుంటుందో చూడాలి.