చెప్పుతో కొట్టిందని గొంతు కోశాడు, పోలీసులు వచ్చే లోగానే...

murder
ఐవీఆర్| Last Modified సోమవారం, 1 మార్చి 2021 (22:16 IST)
నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఓ యువకుడు 35 ఏళ్ల గొంతు కోసి పరారయ్యాడు. స్థానికులు చెప్పిన వివరాలు ఇలా వున్నాయి.

పశ్చిమ బెంగాల్ కు చెందిన 35 ఏళ్ల మహిళ బెంగళూరులోని బనశంకరి పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈమెతో పాటు రఫిక్ అనే యువకుడు కూడా ఉపాధి నిమిత్తం వచ్చాడు. ఇతడు చీరల వ్యాపారం చేస్తూ వుండేవాడు. అతని నుంచి మహిళ గతంలో రూ. 10 వేలు అప్పుగా తీసుకుంది.

ఈ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనితో ఆ మహిళ అతడిని చెప్పుతో కొట్టింది. ఇది జరిగి చాలా రోజులైంది. ఆ కక్షను పెట్టుకున్న రఫిక్, సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై మహిళ నడిచి వెళ్తుండగా కత్తి తీసుకుని హఠాత్తుగా ఆమెపై దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమె మెడపై తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆమె మృతి చెందింది. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :