ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By preethi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (12:02 IST)

భారత మార్కెట్‌లో పట్టు నిలుపుకోవడానికి చైనా కొత్త ఎత్తుగడ

గత కొద్ది కాలంగా చైనా ఉత్పత్తులపై భారతదేశంలో తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా కొంతమంది భారతీయులు తమ వ్యతిరేకతను తెలియజేయడానికి ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి షాపింగ్

గత కొద్ది కాలంగా చైనా ఉత్పత్తులపై భారతదేశంలో తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా కొంతమంది భారతీయులు తమ వ్యతిరేకతను తెలియజేయడానికి ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి షాపింగ్ వెబ్‌సైట్‌లలో చైనాకి సంబంధించిన ఫోన్‌లు, గ్యాడ్జెట్‌ల వంటి ఉత్పత్తులను క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో బుక్ చేస్తున్నారు.
 
ఆ తర్వాత వాటిని రద్దు చేస్తున్నారు. రద్దు చేసే సమయంలో చైనా వైఖరి కారణంగా రద్దు చేస్తున్నాం అని రాస్తున్నారు. వీటిని నివారించడం కోసం చైనా కొత్త మార్గాన్ని అనుసరిస్తోంది. తమ ఉత్పత్తులపై "మేడ్ ఇన్ చైనా" అని రాయడానికి బదులుగా "మేడ్ ఇన్ పిఆర్‌సి" అని రాస్తోంది. పిఆర్‌సి అనగా పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. చైనాకి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.