ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 ఆగస్టు 2021 (09:35 IST)

దేశంలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం కూడా స్వల్పంగా తగ్గాయి. చమురు సంస్థలు ఈ రెండింటిపైనా లీటరుకు 20 పైసల చొప్పున తగ్గించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఇంధన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 
 
డీజిల్ ధర తగ్గడం వారంలో ఇది నాలుగో సారి కాగా, పెట్రోలు ధర తగ్గడం ఇదే తొలిసారి. గత నెల 17న చివరిసారి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. గత కొన్ని నెలలుగా చమురు ధరలను ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారంగా పెంచుతూ వస్తున్న విషయం తెల్సిందే. 
 
అదేసమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలోనే చమురు సంస్థలు ధరల పెంపు జోలికి పోలేదు. ధర పెంపుపై విపక్షాలు ఇప్పటికే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ధరల తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.101.64కు, డీజిల్ ధర రూ.89.07కు తగ్గింది.