శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (09:19 IST)

తెలుగు రాష్ట్రాల్లో నిలకడగానే పెట్రోల్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర నిలకడగానే కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా స్థిరంగానే ఉంది. దీంతో బుధవారం కూడా దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రోజుల నుంచి మార్పు లేకుండా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కూడా ధరల్లో వ్యత్యాసం లేదు.
 
హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగా ఉంది. దీంతో లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20 వద్దనే కొనసాగుతోంది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు రూ. 94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. 
 
గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. రేటులో ఎలాంటి మార్పు లేదు. పెట్రోల్ రేటు లీటరుకు రూ. 110.67 వద్దనే స్థిరంగా ఉంది. డీజిల్ రేటులో కూడా మార్పు లేదు. దీంతో డీజిల్ ధర రూ. 96.08 వద్దనే కొనసాగుతోంది.