శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (17:19 IST)

ప్రజల చిల్లర కష్టాలు తీరనున్నాయి.. ఆగస్టు 15లోపే రూ.200 నోట్లు?

ప్రజల చిల్లర కష్టాలను తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200ల నోట్లను విడుదల చేయనుంది. గత ఏడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.500 రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేస

ప్రజల చిల్లర కష్టాలను తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.200ల నోట్లను విడుదల చేయనుంది. గత ఏడాది రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.500 రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.2వేల నోటుతో చిల్లర కష్టాలు పెరిగిపోవడం గమనించిన ఆర్బీఐ.. చిన్న నోటు రూ.200లను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
 
జూన్ నుంచే రెండు వందల రూపాయల నోట్ల ముద్రణ ప్రారంభమైందని, 21 రోజుల పాటు ఈ నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో ఆగస్టు 15వ తేదీ లోపే రెండొందల కొత్త కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ తుదిదశలో ఉందని ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు రిజర్వ్ బ్యాంకు ఇప్పటికే రూ.2 వేల నోటు ముద్రణను తాత్కాలికంగా ఆపివేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.