బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఏటీఎం వినియోగదారులకు ఎస్బీఐ చిట్కాలు - వడ్డీ రేట్లలో మార్పులు

సురక్షితమైన లావాదేవీల కోసం ఏటీఎం, పీవోఎస్ మిషన్లను ఉపయోగించే ఖాతాదారులకు భారతీయ స్టేట్ బ్యాంకు కొన్ని సలహాలు, సూచనలు చేసింది. ముఖ్యంగా, ఏటీఎం కేంద్రాలకు వెళ్ళేముందు కొన్ని అతిముఖ్యమైన భద్రతా నియమాలను పాటించాలని కోరింది.
 
సురక్షితమైన లావాదేవీలు జరగడానికి ఎస్‌బీఐ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, సైబర్ క్రైం నిందితులు వేరే దారులు వెతుకుతున్నారని తెలిపింది. ఇలాంటి సందర్భంలో ఖాతాదారులు తగిన భద్రతా నియమాలను పాటించవలసిందిగా కోరింది. 
 
అవేంటంటే..
1. ఏటీఎం, పీవోఎస్ మిషన్లలో మీ ఏటీఎం కార్డు పాస్‌వర్డ్ ఎంటర్ చేసే సమయంలో మీ చేతిని అడ్డుగా ఉంచుకోండి.
2. మీ ఏటీఎం కార్డు పిన్‌ నంబర్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఇతరులతో షేర్ చేసుకోకండి.
3. మీ ఏటీఎం కార్డు పిన్ నంబర్‌ను మీ కార్డుపై రాసుకోకండి.
4. మీ ఏటీఎం కార్డు పిన్ నంబర్ చెప్పమని వచ్చే ఫోన్ కాల్స్, ఈమెల్స్, మెసెజెస్‌కు స్పందించకండి.
5. మీ సెల్‌ఫోన్, అకౌంట్ నంబర్‌కు ఉండే నంబర్స్‌ను మీ ఏటీఎం కార్డు పాస్‌వర్డుగా పెట్టుకోకండి.
6. మీ ట్రాన్సాక్షన్ పేపర్‌ను చించి చెత్తబుట్టలో వేయండి.
7. మీ ట్రాన్సాక్షన్ మొదలు పెట్టే ముందే ఏమైనా స్పై కెమెరాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి.
8. ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌ను ఖాతాకు జతచేసుకోండి.
 
మరోవైపు, తన ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. వివిధ కాలపరిమితులతో ఫిక్స్‌డ్‌  పొందనున్నారు. పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 8 నుంచి అమలు చేస్తున్నట్టు బ్యాంకు వెల్లడించింది. 
 
ఇప్పటికే ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసినవారికి, కొత్తగా చేయబోయే వారికి ఈ పెంపుతో లబ్ది చేకూరనుంది. గతేడాది సెప్టెంబరులో వడ్డీ రేట్లను సవరించిన తర్వాత మళ్లీ సవరణ చేయడం ఇదే ప్రథమం. అటు, సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ 50 బేసిస్ పాయింట్ల వరకు అదనంగా అందజేస్తోంది. తద్వారా వారికి 0.5 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ వీ కేర్ డిపాజిట్ స్కీమ్ ద్వారా 30 బేసిస్ పాయింట్లు లభిస్తాయి.
 
తాజాగా సవరించిన వడ్డీ రేట్ల వివరాలను పరిశీలిస్తే,
7 రోజుల నుంచి 45 రోజులు-2.9 శాతం 
46 రోజుల నుంచి 179 రోజులు-3.9 శాతం 
180 రోజుల నుంచి 210 రోజులు-4.4 శాతం 
211 రోజుల నుంచి ఒక ఏడాది లోపు శాతం 
1 ఏడాది నుంచి 2 సంవత్సరాలు శాతం 
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు శాతం 
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు శాతం 
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు శాతం