సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (09:55 IST)

రూ.500లకే గ్యాస్ సిలిండర్.. కసరత్తు చేస్తోన్న తెలంగాణ సర్కారు

LPG Cylinder
రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే దిశగా తెలంగాణ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అమలు చేయాలని డిమాండ్. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.500కు సిలిండర్లు అందిస్తారా? లేక తెల్ల రేషన్ కార్డులు మాత్రమే ఉన్న బీపీఎల్ వర్గాలకు మాత్రమే సిలిండర్ అందిస్తారా? అనే విషయంలో లబ్ధిదారుల ఎంపిక మొదట పూర్తి చేయాలి. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.960 రూపాయలు ఉంది. ఇది తరచుగా మారుతూ ఉంటుంది. అయితే నేరుగా గ్యాస్ కంపెనీలకు ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు చెల్లించి, మిగతా డబ్బులు కస్టమర్లు చెల్లించేలా పథకం అమల్లోకి తీసుకొస్తుందా? ఇలా తీసుకురావాలనుకుంటే గ్యాస్ కంపెనీలు ఇందుకు సహకరిస్తాయా? అనే దానిపై కసరత్తు జరుగుతోంది.