సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 డిశెంబరు 2023 (18:33 IST)

వందేభారత్ ఏసీ స్లీపర్ కోచ్ ఎక్కితే ఇక విమానం ఎక్కరు

Vande bharat Express
కర్టెసి-ట్విట్టర్
వందేభారత్ రైళ్లను తొలుత ప్రవేశపెట్టినప్పుడు కాస్త మందకొడిగా ప్రయాణికుల రద్దీ సాగింది. చార్జీలు ఎక్కువ కావడంతో చాలామంది వెనకడుగు వేసారు. ఐతే వందేభారత్ రైళ్లలో ప్రయాణ గంటలు చాలా తగ్గిపోవడంతో విమానాల్లో ప్రయాణించేవారు చక్కగా వందేభారత్ రైళ్లను ఎక్కేస్తున్నారు. ఐతే వందేభారత్ రైళ్లలో సీట్లు కాస్త ఇరుకుగా వున్నాయన్న వాదనలు వచ్చాయి.
 
ఇప్పుడు వందేభారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు వచ్చేస్తున్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్ చూస్తే అత్యంత సౌకర్యంగా వున్నట్లు కనబడుతోంది. విమాన ప్రయాణాన్ని తీసికట్టుగా వందేభారత్ రైలు లోపల పరిస్థితి కనబడుతోంది. కనుక ఈ రైళ్లు పట్టాలెక్కితే విమానాల్లో ఎక్కే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయే అవకాశం వుందంటున్నారు.