శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (20:24 IST)

ఎగిరే విమానంలో లీకైన వర్షపు నీరు.. సిబ్బంది ఏం చేశారంటే?

air india
ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌లోని గాట్విక్ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో వర్షం నీరు చేరడంతో షాక్‌కు గురైంది. ఈ వర్షపు నీరు ఎయిర్ ఇండియా బోయింగ్ B787 డ్రీమ్‌లైనర్ ఓవర్ హెడ్ స్టోరేజీ ప్రాంతం నుండి క్యాబిన్‌లోకి లీక్ అయింది.

దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందులో విమాన సహాయక బృందం వర్షపు నీరు లీక్ అవుతున్న ప్రాంతాలను గుడ్డతో కప్పడం చూడవచ్చు.
 
ప్రయాణికుల సేవా నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇటీవల రూ.10 లక్షల జరిమానా విధించడం గమనార్హం.