సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (09:33 IST)

ఈ రోజు మార్కెట్‌లో బంగారు ధరల రేటెంత?

gold
గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు వీటి ధర తగ్గితే మరుసటి రోజే తగ్గిన ధర కంటే రెట్టింపు ధర పెరిగిపోతుంది. బుధవారం నాడు భారీగా పెరిగిన బంగారం ధర గురువారం తగ్గింది. ఈ క్రమంలో గురువారం దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో ఉన్న బంగారం ధరలను పరిశీలిస్తే,
 
దేశీయ మార్కెట్లలో చూస్తే హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు ప్రస్తుతం రూ.56,850 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,020 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ ధర స్థిరంగానే ఉంది. ఈ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57 వేల మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంటే 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,170గా ఉంది. 
 
మరోవైపు, బంగారం ధరలు హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ వెండి ధరలు మాత్రం పతనం కావడం గమనార్హం. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.400తగ్గి రూ.76 వేల మార్కును చేరింది. అంతకుముందు రోజు ఇదే రూ.400గా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో కూడా వెండి రేట్లు పడిపోయాయి. ఇక్కడ రూ.400 మేరకు తగ్గి రూ.79 వేలకు చేరుకుంది. బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా, ఇటీవలి కాలంలో వెండి ధర విపరీతంగా పెరిగిపోవడం గమనార్హం.