సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (12:01 IST)

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ

pollution delhi
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీతో పాటు కోల్‌కతా, ముంబై నగరాలు టాప-5లో ఉన్నాయి. ఈ మేరకు స్విస్ గ్రూప్ ఐక్యూ ఎయిర్ ఓ తాజా నివేదికను వెల్లడించింది. 
 
ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచి వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 483గా ఉంది. దీంతో ఐక్యూ జాబితాలో ఢిల్లీ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇక 371 పాయింట్లతో పాకిస్థాన్‌లోని లాహోర్ నగరం రెండో స్థానంలో నిలిచింది. కోల్‌కతా నగరం 206 పాయింట్లతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 189 పాయింట్లతో, పాకిస్థాన్‌లోని కరాచీ నగరం 162 పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక 162 పాయింట్లతో ముంబై ఆరో స్థానంలో ఉండగా, చైనాలోని షెన్యాంగ్ 159 పాయింట్లతో హౌంగ్జౌ 159 పాయింట్లతో కువైట్ నగరం 155 పాయింట్లతో చైనాలోని వుహాన్ నగరం 152 పాయింట్లతో టాప్ 10 స్థానాల్లో ఉన్నాయి. 
 
ఏక్యూఐ 0-50గా ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్టు భావిస్తారు. కానీ డిల్లీ ఏ సమయంలో చూసినప్పటికీ ఇది 400 -500 మధ్యగా ఉంది. ఈ గాలిని పీల్చడంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాలు బారినపడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ రాజధాని ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించిన విషయం తెల్సిందే.