సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (16:44 IST)

కన్నకొడుకల గొంతు కోసిన తండ్రి.. ఆపై ఆత్మహత్యాయత్నం

murder
కన్నతండ్రే తన ఇద్దరు మైనర్ కుమారుల గొంతు కోసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ కుమారుల్లో రెండేళ్ల వాడు ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ళ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీలోని వజీర్ ‌పూర్ ప్రాంతంలో ఇద్దరు మైనర్ కుమారుల గొంతుకోసి హతమార్చాలని ఒక తండ్రి ప్రయత్నించాడు. ఆ తర్వాత అదే కత్తితో తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. 
 
ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో ఉన్న భరత్ నగర్ సమీపంలోని జేజే కాలనీ ఉంటుంది. అందులో ఇన్వర్టర్ మెకానిక్‌గా పని చేసే 36 యేళ్ల నిందితుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ గొడవలతో క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకుల గొంతు కోసం చంపేయడానికి ప్రయత్నంచాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకున్నాడు. 
 
ఆ సమయంలో అతడి భార్య ఇంట్లో లేదు. ఈ ఘటనలో రెండేళ్ల వయస్సున్న చిన్న కొడుకు ప్రాణాలు కోల్పోగా, ఐదేళ్ల వయస్సున్న పెద్ద కుమారుడు దారుణానికి పాల్పడిన కన్నతండ్రి తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆస్పత్రి తరలించారు. కుటుంబ గొడవలే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.