శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2023 (10:38 IST)

పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర తగ్గింది...

gold
దేశంలోని పసిడి ప్రియులకు ఇది నిజంగానే శుభవార్త. దేశంలో బంగారు ధర తగ్గింది. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు.. మంగళవారం ఈ ధర తగ్గింది. ఒక గ్రాముపై రూ.50 మేరకు తగ్గింది. అలాగే, గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండిధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. మంగళవారం నమోదైన వివరాల మేరకు.. కిలో వెండి ధర రూ.79000 వద్ద కొనసాగుతుంది. 
 
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో మంగళవారం నాటి బంగారు ధరలను పరిశీలిస్తే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,640గా కొనసాగుతుంది. 
 
అలాగే, ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,790గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,640గా ఉంది. చెన్నైలో ఈ ధర రూ.57,050గా ఉంటే, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,230కు చేరింది.