టమోటా ధరకు రెక్కలు.. కేజీ టమోటా రూ.60..!
కరోనా వేళ వ్యాపారాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇంకా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు అందరికి అందుబాటులో ఉండే టమోట ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటింది. ప్రస్తుతం పెరిగిన టమోటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు ఉంది. దీంతో సామాన్యులు షాక్‌కు గురవుతున్నారు.
కేవలం టమాటా ధర మాత్రమే కాకుండా కూరగాయల ధరలు కూడా పెరిగాయి. అలాగే టమోటా ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఇటీవల కురిసిన భారీ వర్షాలేనని వ్యాపారులు చెప్తున్నారు. భారీ వర్షాలకు చాలా జిల్లాల్లో టమోటా పంట కొట్టుకుపోయింది. మరికొన్ని చోట్ల పూర్తిగా కాయకముందే వర్షాల వల్ల టమోటా కోయాల్సి వచ్చిందని చెప్తున్నారు.