సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (11:02 IST)

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్-వెలవెలోబోయిన బంగారం ధరలు

అవును.. పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూస్. బంగారం ధర వెలవెలోబోయింది. బుధవారం భారీగా పెరిగిన బంగారం ధర గురువారం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పసిడి తగ్గితే వెండి కూడా ఇదే దారిలో నడిచింది. 
 
బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
 
ఈ నేపథ్యంలో గురువారం బంగారం ధరలు పడిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పడిపోయింది. దీంతో ధర రూ.56,240కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,560కు క్షీణించింది. 
 
పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3000 పడిపోయింది. దీంతో ధర రూ.68,100కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.