శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 జులై 2020 (19:15 IST)

విలీనం తరువాత బీమా పంపిణీ ఛానెల్స్‌ను విస్తరించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కేంద్ర ప్రభుత్వ విలీన పథకం ప్రకారం 2020 ఏప్రిల్ 1 నుండి ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్‌లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో విలీనం చేయబడ్డాయి. దీని ఫలితంగా 9500+ కంటే ఎక్కువ శాఖలతో బలమైన నెట్‌వర్క్ ఉన్న బ్యాంకుగా యూనియన్ బ్యాంకు మారింది.
 
విలీనానికి ముందు ఈ బ్యాంక్, ఎస్.యు.డి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను, బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క జనరల్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉత్పత్తులను మరియు కార్పొరేట్ ఏజెన్సీ టై-అప్ ఒప్పందాల కింద రెలిగెరె హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క ఆరోగ్య బీమా ఉత్పత్తులను పంపిణీ చేసింది. 
 
విలీనం తరువాత, బ్యాంక్ తన వినియోగదారులకు ఈ రంగంలోనే ఉత్తమమైన ఉత్పత్తులు మరియు సేవలను అందించే ప్రయత్నంలో, జీవిత బీమా విభాగంలో ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఎల్ఐసి ఆఫ్ ఇండియాలతో, సాధారణ బీమా విభాగంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌తో మరియు ఆరోగ్య బీమా విభాగంలో మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లతో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించింది.
 
పై కార్పొరేట్ ఏజెన్సీ టై-అప్‌ల కొనసాగింపు, పూర్వపు ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ పాలసీదారులకు వినియోగదారులకు నిరంతరాయంగా విక్రయానంతర సేవలను సులభతరం చేస్తుంది. ఇప్పుడు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అన్ని బ్రాంచ్ అవుట్లెట్లు మూడు జీవిత బీమా సంస్థల బీమా ఉత్పత్తులను, నాలుగు సాధారణ బీమా సంస్థల బీమా ఉత్పత్తులు మరియు రెండు స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థల బీమా ఉత్పత్తులను అందిస్తాయి. బీమా పంపిణీ ఛానల్ యొక్క విస్తరణ, బ్యాంక్ వినియోగదారులలో బీమా గురించి అవగాహన కల్పించడం ద్వారా బీమా వ్యాప్తిని పెంచడానికి బ్యాంకుకు సహాయపడుతుంది.