Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఏపీలో 19వ తేదీ వరకు ఎంసెట్ రాత పరీక్షలు

Written By వరుణ్
Published: సోమవారం, 15 మే 2023 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15వ తేదీ సోమవారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు మొదటి దశ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ఈ పరీక్ష ప్రారంభమైంది. 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఈఏపీసెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. 15 నుంచి 19వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23వ తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్సిలర్ ఆచార్య రంగ జనార్థన్ వెల్లడించారు. 
 
ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఇందుకోసం ఉదయం 7.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటలకు నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని వెల్లడించారు. 
 
ఏపీలో 129, తెలంగాణాలో 7 చోట్ల పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో 3.40 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు గుర్తింపు కోసం ఏదేనా గుర్తింపు కార్డును తమ వెంట తప్పనిసరిగా తీసుకుని రావాలని సూచించారు. 

అన్నీ చూడండి

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా హీరో కుమార్తె

నేను చేసిన 6 నిమిషాల నవరసాల సీన్ హైలైట్ గా నిలుస్తుంది - నరేష్ విజయ కృష్ణ

Kajal Chowdary: గోల్డ్ స్పాట్ మూవీ ఫస్ట్ సింగిల్ పరిచయమే. రిలీజ్

జై జాస్తి, మేధ మేక హీరో హీరోయిన్‌లుగా మైత్రీ ఇన్ లవ్ ప్రారంభం

Deva Katta: వ‌ర్షాలు ప‌డితే వ‌జ్రాలు దొరుకుతాయనే కథ తో జో జో’ కాష‌న్ 1 చిత్రం

తర్వాతి కథనం
Show comments