Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు

Written By ఠాగూర్
Updated: గురువారం, 3 ఆగస్టు 2023 (12:41 IST)
ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనో గ్రాఫర్‌  పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 1207 స్టెనోగ్రాఫర్‌ సి (గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌ ), స్టెనో గ్రాఫర్‌ డి (గ్రూప్‌ సి) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
 
ఇందుకోసం జారీ చేసిన నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, మొత్తం ఉద్యోగాలు 1207 కాగా.. వాటిలో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సి 93,  స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ డి 1114 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు కచ్చితంగా 12వ తరగతి పాసై ఉండాలి.
   
స్టెనోగ్రాఫర్‌ సి పోస్టులకు ఆగస్టు 1, 2023 నాటికి 18-33, స్టెనోగ్రాఫర్‌ డి 18-27 ఏళ్లు ఉండాలి. వివిధ కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు. దరఖాస్తు ఫీజుగా రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఆగస్టు 24, 25 తేదీల వరకు గడువిచ్చారు. 
 
అక్టోబరులో నిర్వహించే కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ (https://ssc.nic.in)లో చూడొచ్చు. ఈ పరీక్ష కోసం తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షఆ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, వరంగల్ నగరాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments