శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (23:15 IST)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ.. 23శాతం ఉద్యోగాలు గోవిందా!

Jobs
ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ప్రభావితమవుతాయని తాజాగా ఓ అధ్యయనం ప్రచురించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ప్రపంచంలోని అన్ని రంగాలను విస్తరించింది. దీని వల్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. 
 
స్విట్జర్లాండ్‌లోని కాల్జినీలో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక నివేదికను ప్రచురించింది. రాబోయే కొద్ది సంవత్సరాలలో, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొత్తం ఉద్యోగాలలో 23 శాతం వరకు కృత్రిమ సాంకేతికత ద్వారా ప్రభావితమవుతుంది. దీని ఫలితంగా 1.4 మిలియన్ల ఉద్యోగాలు పోతాయని తేలింది. 
 
అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఆఫీస్ వర్క్, ఫ్యాక్టరీ, రిటైల్ వర్క్ వంటి వాటిపై ప్రభావం పడుతుందని ఆ అధ్యయనం తేల్చింది. కేవలం 90 లక్షల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడతాయని టాక్.