శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మే 2023 (17:04 IST)

బీజేపీ ఆధిపత్య సిద్ధాంతాలు పనిచేయలేదు.. పి. చిదంబరం

chidambaram
కర్ణాటకలో బీజేపీ ఆధిపత్య సిద్ధాంతాలు పనిచేయలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత పి. చిదంబరం విమర్శించారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి భారత రాజ్యాంగ ప్రాథమిక విలువలను సమర్థించడమని అభివర్ణించారు. అలాగే బీజేపీ ఆధిపత్య సిద్ధాంతాలు, వివక్ష, పక్షపాతం వల్ల జరిగే నష్టాన్ని కర్ణాటక ప్రజలు తమ తీర్పుతో నిలువరించారని చిదంబరం ట్వీట్ చేశారు. 
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది.  మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ సంఖ్య 113ను కాంగ్రెస్‌ పార్టీ దాటింది. 136 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దీంతో కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి.