ఓటమిని అంగీకరించిన బసవరాజ్ బొమ్మై.. రోన్ సెంటిమెంట్ ప్రకారమే..?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై బొమ్మై తాజాగా స్పందించారు. మెజారిటీ మార్కు చేరుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. పార్టీ ఓటమిని అంగీకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ వర్కర్లు, నేతలు.. అందరమూ శాయశక్తులా పార్టీని గెలిపించేందుకు కృషి చేశామని బొమ్మై చెప్పారు.
అయినా ఫలితం దక్కలేదని చెప్పారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక పార్టీలో అంతర్మథనం చేసుకుంటామని వివరించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మరింత కష్టపడతామని బొమ్మై పేర్కొన్నారు.
మరోవైపు కర్ణాటకలో రోన్ నియోజకవర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టాక్. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తోంది. రోన్ నియోజకవర్గంలో మొత్తం 2,21,059 మంది ఓటర్లు ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థి సంగనగౌడ పాటిల్ 94,064 ఓట్లు సాధించి గెలుపొందారు.