శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (10:06 IST)

హాకీ ప్రపంచ కప్‌లో భారత్ నిష్క్రమణ

Indian Hockey Team
హాకీ ప్రపంచ కప్‌లో భారత్ నిష్క్రమించింది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ హాకీ ప్రపంచ కప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లో విఫలమైంది. 
 
న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. భారత్ వర్గీకరణ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 26న జరగనుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నిర్ణీత సమయానికి స్కోరు 3-3తో సమం కాగా, పెనాల్టీ షూటవుట్ నిర్వహించారు. పెనాల్టీ షూటవుట్‌లో భారత్ 4-5 తేడాతో ఓడిపోయింది. 
 
షూటవుట్‌లో షంషేర్ సింగ్, సుఖ్ జీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్ మిస్ చేయడం భారత్‌కు ప్రతికూలంగా వుంది.
 
తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 2-0తో, మూడో క్వార్టర్‌లో 3-1తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. ప్రాథమిక తప్పిదాలు చేసి బ్లాక్ స్టిక్స్‌ను 3-3తో సమం చేసి మ్యాచ్‌ను షూటౌట్ లోకి తీసుకెళ్లింది. 
 
భారత ఆటగాళ్లు 11 పెనాల్టీ కార్నర్లు సాధించినా కేవలం రెండు గోల్స్ మాత్రమే చేయగలిగారు. 18 సర్కిల్ ఎంట్రీలు ఉన్నప్పటికీ గోల్ వద్ద కేవలం 12 షాట్లు మాత్రమే చేయగలిగారు.