సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (12:16 IST)

పీజీసీఐఎల్ నుంచి నోటిఫికేషన్.. మరో 33 పోస్టుల భర్తీ

కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-(పీజీసీఐఎల్) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీసీఐఎల్ ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే 147 పోస్టుల భర్తీ చేపట్టింది. ప్రస్తుతం మరో 33 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 
 
హెచ్ఆర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఒక ఏడాది కాలవ్యవధి గల అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 31 చివరి తేదీ. దరఖాస్తు చేసేముందు అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. పర్సనల్ మేనేజ్‌మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. గత రెండేళ్ల లోపు క్వాలిఫయింగ్ ఎగ్జామ్ పాసైనవారు మాత్రమే దరఖాస్తు చేయాల్సి వుంటుంది.
  
మొత్తం హెచ్ఆర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 33
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31విద్యార్హత- ఫుల్ టైమ్ ఎంబీఏ (హెచ్ఆర్), ఎంఎస్‌డబ్ల్యూ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్, 
వేతనం- రూ.15,000.