గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (10:50 IST)

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. 1300 ఖాళీలు భర్తీ

railway job
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పారా మెడికల్‌లోని వివిధ కేటగిరీలలో 1300లకు పైగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 1376 పోస్టులు ఉండగా.. అభ్యర్థులు ఆర్ఆర్‌బీ ప్రాంతీయ వెబ్‌సైట్స్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. 
 
అప్లికేషన్స్ ఆగష్టు 17వ తేదీ నుంచే ప్రారంభమవగా.. అప్లికేషన్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 16. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. 
 
అభ్యర్థులందరికీ దరఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, వికలాంగులు, స్త్రీ, ట్రాన్స్‌జెండర్స్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు ఫీజు రూ. 250.