మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (14:41 IST)

నోట్ల రద్దుతో ఉద్యోగాలు హాంఫట్... దేశంలో పెరిగిన నిరుద్యోగం

దేశంలో నోట్ల రద్దుతో లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ముఖ్యంగా డీమానిటైజేషన్ పుణ్యమాని ఏకంగా కోటి మందికి పైగా ఉపాధి కోల్పోయినట్టు తాజా సర్వేలు వెల్లడించాయి. దీనికితోడు దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకుంది. అంటే గత ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 7.2 శాతానికి చేరుకుంది.
 
గత 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి.
 
పెద్దనోట్ల రద్దు తర్వాత 2018లో దాదాపు 1.10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సీఎంఐఈ జనవరి నివేదిక వెల్లడించింది. మరోవైపు నోట్ల రద్దు ప్రభావం ఉద్యోగాలపై ఏ మేరకు ఉందో తెలిపే సమాచారం తమ వద్ద లేదని కేంద్రం పార్లమెంటులో వెల్లడించిందని ఆ సర్వేలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది.