ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చైనీస్
Written By pnr
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (12:28 IST)

పులియబెట్టిన కళేబరం... మిడతల ఫ్రై... ఎండబెట్టిన బల్లులు.. ఆ దేశాల్లో బెస్ట్ ఫుడ్స్..

సాధారణంగా ఆయా ప్రాంతాలకు, ప్రదేశాలకు, దేశాలకు అనుగుణంగా ఆహార పద్దతులు, అలవాట్లు ఉంటాయి. అనేక ప్రాశ్చాత్య దేశాల్లో బ‌ర్గ‌ర్లు, పిజ్జాలను లొట్టలేసుకుని ఆరగిస్తారు. భారత్‌లో అయితే చికెన్, ప‌న్నీర్‌టిక్కా

సాధారణంగా ఆయా ప్రాంతాలకు, ప్రదేశాలకు, దేశాలకు అనుగుణంగా ఆహార పద్దతులు, అలవాట్లు ఉంటాయి. అనేక ప్రాశ్చాత్య దేశాల్లో బ‌ర్గ‌ర్లు, పిజ్జాలను లొట్టలేసుకుని ఆరగిస్తారు. భారత్‌లో అయితే చికెన్, ప‌న్నీర్‌టిక్కా, బేల్‌పూరి, పావుబజ్జీ, వ‌డపావ్, ఆలూచాట్, చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో చేసిన వివిధ రకాల నోరూరించే వంటకాలను ఆరగిస్తుంటారు. 
 
కానీ, కొన్ని దేశాల్లో మాత్రం పులియబెట్టిన కళేబరం, మిడతల ఫ్రై, ఎండబెట్టిన బల్లులు.. వంటివి అమిత ఇష్టంగా ఆరగిస్తారట. యూర‌ప్ కంట్రీ ఐస్ లాండ్‌లో కుళ్లిపోయిన షార్క్ క‌ళేబ‌రాన్ని పులియ‌బెట్టి త‌ర్వాత ఫ్రై చేసి అమ్ముతార‌ట‌. దీన్నే హకర్ల్ అంటారట. దీన్ని ఆ ప్రాంత వాసులు లొట్ట‌లేసుకుంటూ తింటార‌ట‌. 
 
ఇకపోతే.. భారత్‌లో ఎండబెట్టిన చేపలకు ఎలాంటి గిరాకీ ఉంటుందో.. అలాగే, చైనాలో ఎండబెట్టిన బల్లులకు మంచి డిమాండ్ ఉంటుంది. సాధార‌ణంగా ఇంట్లో బ‌ల్లుల‌ను చూస్తేనే ఆమ‌డ‌దూరం ప‌రిగెడ‌తాం. కానీ చైనీయులు మాత్రం అవే బ‌ల్లుల‌ను మాంచిగా ఎండ‌బెట్టుకొని ఫ్రై చేసుకొని తింటారు. 
 
కెనడాలో తెగ ఫేమస్ అయిన వంటకం. రాకీ మౌంటెన్ ఓయిస్ట‌ర్స్. దీన్ని ఎద్దు, పంది, గొర్రె వృష‌ణాల‌తో చేసే వంట‌కం. అలాగే, పోలాండ్‌లో ఇన్‌సెక్ట్ చాకోలేట్ తెగ ఫేమ‌స్. చాకోలేట్‌లో ఎవ‌రైనా డ్రై ఫ్రూట్స్, న‌ట్స్ వేసుకొని తింటారు. వీళ్లుమాత్రం పురుగులను క‌లుపుకొని లాగించ‌స్తారు. 
 
అదేవిధంగా చైనీయులు, థాయిలాండ్‌లో ఆకుప‌చ్చ రంగులో కనిపించే మిడుతలను ఫ్రై చేసుకుని లొట్ట‌లేసుకుంటూ తింటార‌ట. చైనీయులు అయితే ఎలుకలను కూడా ఫ్రై చేసుకుని ఆగిస్తారట. అంతేనా.. స్పైడ‌ర్ ఫ్రై, పిండంగా ఉన్న బాతు గుడ్డు, జడలబర్రె మ‌ర్మాంగంతో చేసిన వంట‌కం, పంది మెద‌డుతో తయారు చేసిన ఫ్రైడ్ బ్రెయిన్ సాండ్ విచ్‌ వంటి వంటకాలు కూడా మంచి ఫేమస్.