దేవుడు సమస్తాన్ని సృష్టించాడు.. చెడును కూడా..?

మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:29 IST)
దేవుడు సమస్తాన్ని సృష్టించాడు.. కాబట్టి చెడును కూడా ఆయనే సృష్టించివుంటాడని తొలుత అనిపిస్తుంది. చెడు దానంతట అది ఉనికిలో ఉండలేదు, వాస్తవానికి మంచిలోపించటమే చెడు. 
దేవుడు సృష్టించినపుడు వాస్తవానికి మంచివిగా సృష్టించాడు. దేవుడు సృష్టించిన మంచివాటిలో మంచిని ఒకటే ఎంపిక చేసుకోగలిగేది స్వేచ్ఛగలిగిన జీవులు మాత్రమే. వాస్తవికమైన ఎంపిక చేసుకోవటానికి వీలు కల్పించుటకుగాను, మంచికి భిన్నముగాని ఎంపిక చేసుకొనే అనుమతిని దేవుడు కల్పించాడు. 
 
దేవుడు, దేవదూతలు మరియు మనుష్యులకు మంచిని అంగీకరించే లేక మంచిని తృణీకరించీ (చెడు) చేయుటకుగాను ఎంపిక చేసుకొనే అనుమతిని దేవుడు కల్పించాడు. రెండు మంచి విషయముల మధ్య చెడు సంభంధమున్నట్లయితే దానిని చెడ్డది అని అంటాం. అయితే అది దేవుడు సృష్టించిన చెడ్డ వస్తువు కాదు. అయితే అది ఒక వస్తువు అయిపోలేదు, దానిని దేవుడు సృష్టించాడు అన్నట్లు.
 
ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే చక్కని ఉదాహరణ ఏంటంటే.. "చలి ఉనికిలో ఉందా" అని ఎవరైనా అడిగితే "ఉంది" అని జవాబివ్వవచ్చు. అయితే అది సరియైన జవాబు కాదు. ఎందుకంటే చల్లదనం ఉనికిలో ఉండదు, ఉష్ణత లోపించడమే చల్లదనం. అదేవిధంగా అంధకారము అనేది ఉనికిలో ఉండదు, వెలుగు లోపించడమే. చెడు అనేది మంచిలోపించటమే. ఇంకా శ్రేష్టమైన జవాబు ఏంటంటే చెడు అనేది దేవుడు లోపించడమే. 
 
దేవుడు చెడును సృష్టించాల్సిన ఆసరంలేదు. అయితే మంచి లేకుండా ఉండగలిగేవుండే పరిస్థితిని అనుమతించాలి. దేవుడు చెడును సృష్టించలేదుగాని అనుతించాడని క్రైస్తవ గురువులు సెలవిస్తున్నారు.

అన్నీ చూడండి

జూలై 14, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణ నివేదిక ఎలా వుందంటే?

ఢిల్లీలో దారుణం - నడి రోడ్డుపై భార్యను కాల్చి చంపిన కానిస్టేబుల్ (వీడియో)

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన దేవేంద్ర ఫడ్నవీస్ (video)

వైద్యం వికటించి మహిళకు కాలు తీసేశారు... అభిషేక్ బెనర్జీకి చిక్కులు

బ్యాంకాక్ పబ్‌లో విషాదం... 27 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

14-07-2026 మంగళవారం ఫలితాలు (అమావాస్య) - దంపతుల మధ్య అకారణ కలహం

జూలై 14న భౌమవతీ అమావాస్య.. కుజ దోషాలు తొలగిపోవాలంటే?

13-07-2026 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు...

12-07-2026 నుంచి 18-07-2026 వరకు మీ వార ఫలితాలు

12-07-2026 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు...

Show comments