Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా కల్లోలం.. లక్ష దాటేసిన పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 7 జనవరి 2022 (10:05 IST)
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కల్లోలం సృష్టిస్తుంది. ఫలితంగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా లక్షకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజానికి దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనప్పటి నుంచి భారీగానే కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా, రెండు మూడు రోజులుగా కొత్త కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,17,100గా నమోదయ్యాయి. ఈ వైరస్ సోకడం వల్ల మరో 302 మంది మృత్యువాతపడ్డారు. ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 36,256 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుని ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 3,71,363కు పెరిగాయి. అదేవిధంగా ఒమిక్రాన్ కేసుల్లో కూడా పెరుగుదల కనిపించింది. 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు మొత్తం నమోదైన ఒమిక్రాన్ కేసులు కలుపుకుంటే 2630కు చేరింది. 

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments