సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జులై 2020 (16:14 IST)

ఆంధ్రాలో కరోనా విజృంభణ - 1555 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఫలితంగా గత 24 గంటల్లో ఏకంగా 1555 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏపీ నుంచి 1,500 కేసులు నమోదు కాగా... 53 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో, రెండు కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో నమోదయ్యాయి. 
 
24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో చిత్తూరు (236), గుంటూరు (228), విశాఖ (208), శ్రీకాకుళం (206) ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణా, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.  
 
మరోవైపు గత 24 గంటల్లో 13 మంది కరోనా కారణంగా చనిపోయారు. 904 మంది ఆసుపత్రుల్లో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుత కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,814కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 277కి చేరుకుంది.
 
ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో ఉన్న యాక్టివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూరం 984, చిత్తూరు 986, ఈస్ట్ గోదావరి 1406, గుంటూరు 1355, కడప 958, కృష్ణ 725, కర్నూలు 1087, నెల్లూరు 465, ప్రకాశం 314, శ్రీకాకుళం 504, విశాఖపట్టణం 634, విజయనగరం 210, వెస్ట్ గోదావరి 916 చొప్పున ఉన్నాయి.